అది భాజపా వ్యాక్సిన్‌.. నేను తీసుకోను: అఖిలేశ్‌

యావత్‌ దేశం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న వేళ యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 టీకాను తాను తీసుకోబోనని చెప్పారు. అది భాజపా.......

Updated : 03 Jan 2021 05:09 IST

లఖ్‌నవూ: యావత్‌ దేశం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న వేళ యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 టీకాను తాను తీసుకోబోనని చెప్పారు. అది భాజపా వ్యాక్సిన్‌ అని, దాన్ని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. అలాంటి వ్యాక్సిన్‌ తీసుకోబోనని స్పష్టంచేశారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన డ్రైరన్‌ జరుగుతోంది. ఆ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న అఖిలేశ్‌ యాదవ్‌ను వ్యాక్సిన్‌ గురించి మీడియా ప్రశ్నించగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తామని చెప్పారు. అఖిలేశ్‌ వ్యాఖ్యలను భాజపా నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖండించారు. వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు చేయడం ద్వారా డాక్టర్లను, సైంటిస్టులను ఆయన అవమానిస్తున్నారని అన్నారు. దీనిపై అఖిలేశ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి..

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!
దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని