ChandraBabu: ఏపీలో నిరంకుశ పాలన.. జోక్యం చేసుకోండి: రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

ఏపీలో హింస, నిరంకుశ పాలన, అరాచకాలను జరుగుతున్నాయంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Updated : 13 Aug 2023 14:01 IST

అమరావతి: ఏపీలో హింస, నిరంకుశ పాలన, అరాచకాలను జరుగుతున్నాయంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తనపై దాడుల విషయమై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులను వివరిస్తూ ఆయన 9 పేజీల లేఖ రాశారు.

Pattiseema: పట్టిసీమ నాపై పగబట్టిందే..!

2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మోహన్‌ రెడ్డి తన ‘విధ్వంసక పాలన’ను ఆవిష్కరించారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా వేదికను కూల్చివేయడం సహా ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశారని దుయ్యబట్టారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని తీవ్రంగా విమర్శించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడాన్ని లేఖలో సవివరంగా తెలిపారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను లేఖలో వివరించారు. ఏపిని అశాంతి నుంచి రక్షించడానికి తగు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిని ఆయన కోరారు. 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్‌ను, వీడియోలను చంద్రబాబు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని