Chandrababu: ఈ ఏడాది రాష్ట ప్రజల జీవితాల్లో వెలుగులు ఖాయం: చంద్రబాబు

నాలుగేళ్లుగా వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై దాడులు జరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొత్త సంవత్సరంలో ఇక అధికార పార్టీ ఆటలు సాగవని పంచాంగంలో చెప్పారని ఆయన అన్నారు.

Published : 22 Mar 2023 15:01 IST

అమరావతి: శోభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్రానికి అన్నీ శుభాలే జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం నాలుగేళ్లు కష్టాల్లోనే ఉంది. ఈ ఏడాది నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయం. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారు.

నిత్యావసర ధరలు, పన్నులు పెరిగి ప్రజలపై మోయలేని భారం పడింది. ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేస్తాం. వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై దాడులు జరిగాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడని అరాచకాలు ఈ నాలుగేళ్లలో చూశాం. తెలుగుజాతి అనేక రంగాల్లో రాణిస్తోంది. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగువారి ప్రతిష్ఠ పెరిగింది. తెలుగువారి కోసమే తెదేపా ఏర్పడింది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని