TDP: ‘యాత్ర-2’ కోసం అసెంబ్లీని వాయిదా వేశారు: అచ్చెన్నాయుడు

శాసనసభను వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు.

Updated : 08 Feb 2024 14:04 IST

అమరావతి: శాసనసభను వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారి తీసింది తప్పితే.. సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడలేదన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను దహనం చేసినట్లు తెలిపారు. 

‘‘నేడు శాసనసభ సమావేశాల చిట్టచివరి రోజు. సభను ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. కోరం లేకపోవడంతో సభను 9.15కి వాయిదా వేశారు. 2 గంటలైనా మళ్లీ సమావేశపరచలేదు. యాత్ర-2 సినిమా విడుదలవుతోందని అసెంబ్లీని వాయిదా వేశారు. అందుకే మేం నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చాం’’ అని అన్నారు.

తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈ ఐదేళ్లు చీకటిరోజులన్నారు. వాకౌట్‌ చేస్తున్నామని చెప్పేందుకు కూడా మైక్‌ ఇవ్వని విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కారని ఆరోపించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా సభ జరిగిందన్నారు. రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి నెట్టేలా చీకటి జీవోలను తీసుకొచ్చారని విమర్శించారు. ఆయా జీవోల వివరాలను ఆయన వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని