AP News: మాచర్లలో వైకాపా గూండాలు దౌర్జన్యాలకు దిగారు.. ఎస్‌ఈసీకి అచ్చెన్న లేఖ

మాచర్లలో వైకాపా అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. 

Updated : 27 Feb 2024 22:07 IST

అమరావతి: మాచర్లలో వైకాపా అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) లేఖ రాశారు. ఆక్రమణకు గురయ్యే పోలింగ్‌ కేంద్రాల వివరాలను లేఖలో వెల్లడించారు. ‘‘మాచర్లలో వైకాపా గూండాలు దౌర్జన్యాలకు దిగారు. అక్కడి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. 2021 స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదని, 2009, 2014, 2109లో స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ విశ్లేషించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. 

మరో తెదేపా నేత షరీఫ్‌ కూడా ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాలంటీర్లకు డబ్బులు పంచారని ఆరోపించారు. సమగ్ర విచారణ చేసి ఎమ్మెల్యేపై, రాజకీయ పార్టీ భేటీకి హాజరైన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని