విద్యార్థుల‌ను ప్ర‌మాదంలోకి నెడ‌తారా?: లోకేశ్‌

ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప్ర‌థమ సంవ‌త్స‌ర పరీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సీఎం

Published : 30 May 2021 01:36 IST

అమ‌రావ‌తి: ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప్ర‌థమ సంవ‌త్స‌ర పరీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల విద్యార్థుల భ‌విష్య‌త్తుపై ప్ర‌భావం ప‌డుతోంద‌న్నారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి విద్యార్థుల‌ను ప్ర‌మాదంలోకి నెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. ముందు చూపు లేక‌పోవ‌డంతో విద్యా సంవ‌త్స‌రంలో గంద‌ర‌గోళం నెల‌కొంద‌న్నారు. జులైలో పరీక్ష‌లు పెట్టి, ఫ‌లితాలు ఇస్తే ప్ర‌వేశాల ప్రక్రియ ఆల‌స్యం అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌వేశాల ప్ర‌క్రియ పూర్తి చేసే లోపు అక్టోబ‌ర్ దాటిపోతుంద‌ని వివ‌రించారు. 18- 44 ఏళ్ల వ‌ర‌కూ టీకాలు ఇవ్వ‌లేమ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని లోకేశ్ అన్నారు. కొవిడ్ భ‌యంతో మంత్రివ‌ర్గ స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేద‌ని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని