Huzurabad by election: తెరాస నేత కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం.. స్థానికేతరుడంటూ అడ్డగింత

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ..

Updated : 09 Aug 2022 12:35 IST

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఘన్ముక్ల పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగా.. స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అని అంటూ భాజపా శ్రేణులు నిలదీశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా పోలింగ్‌ కేంద్రం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల వరకు హుజూరాబాద్‌లో 10.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

వీణవంకలోనూ..

పోలింగ్‌ కేంద్రాల వద్ద తెరాస నేత కౌశిక్‌రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. ఘున్మక్లలాగే వీణవంక పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. వీణవంక జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రానికి ఆయన వెళ్లగానే తెరాస మినహా ఇతర పార్టీల కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని