Jaggareddy: రేవంత్‌ను తాలిబన్లతో పోల్చడాన్ని సమర్థించను: జగ్గారెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాలిబన్లతో పోల్చడాన్ని తాను సమర్థించనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు...

Published : 05 Sep 2021 17:04 IST

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాలిబన్లతో పోల్చడాన్ని తాను సమర్థించనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌పై కోమటిరెడ్డికి కోపం ఉంటే పార్టీలోనే ఉండేవారు కాదని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘విజయమ్మ ఆహ్వానం మేరకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఆత్మీయ సమ్మేళనం సభ అనుకొని వెళ్లి ఉండొచ్చు. ఎంపీ కోమటిరెడ్డి విషయంలో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఏ కోణంలో మాట్లాడారో తెలియదు. పార్టీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క నిర్ణయాలను సమర్థిస్తున్నా. కోమటిరెడ్డికి, పీసీసీ కొత్త కమిటీకి కొంత కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే ఆయన కూడా గాంధీ భవన్‌కు వస్తారు. కేసీఆర్‌, అమిత్‌ షా కలిసిపోతే.. బండి సంజయ్‌ యాత్ర చేసి ఏం ఉపయోగం. కేసీఆర్‌ను జైల్లో పెడతామని సంజయ్‌ వందసార్లు చెప్పారు. కేసీఆర్ ను జైల్లో పెట్టాల్సిన అమిత్ షా ముందే కేసీఆర్ దర్జాగా కూర్చున్నారు’’ అని జగ్గారెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని