TS politics: హుజూరాబాద్‌లో తెరాస, భాజపా మధ్యే పోటీ: హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని.. ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ఈటలకు ఓటు వేస్తే వారికి ఏం చేస్తారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన

Updated : 24 Sep 2022 17:15 IST

ఇల్లందకుంట: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని.. ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ఈటలకు ఓటు వేస్తే వారికి ఆయన ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌లో తెరాస, భాజపా మధ్యే పోటీ ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే కనిపిస్తోంది. ఈటల హజూరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు కట్టించలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిస్తే కట్టిస్తారా?అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం పని చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

కేసీఆర్‌కు పాదాభివందనాలు: గెల్లు శ్రీనివాస్‌యాదవ్

హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థిగా ఎంపికైన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశమిచ్చారని చెప్పారు. ‘‘తెరాస తరఫున హుజూరాబాద్‌లో పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు. నన్ను గెలిపించాలని మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. దళిత, బహుజన విద్యార్థుల కోసం పోరాడా. పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు’’ అని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని