ZPTC MPTC Counting: ఏపీలో సాయంత్రం 4గంటల వరకు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4గంటల వరకు 144 జడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను బట్టి  ..

Updated : 19 Sep 2021 17:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4గంటల వరకు 144 జడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను బట్టి  142 స్థానాల్లో వైకాపా, రెండు స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో ఒక్కో స్థానంలో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. వైకాపా.. విజయనగరం జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 9, తూర్పుగోదావరిలో 1, కృష్ణాలో 1, గుంటూరు జిల్లాలో 3, ప్రకాశంలో 17, నెల్లూరు జిల్లాలో 22, చిత్తూరులో 31, కడపలో 1, కర్నూలులో 35, అనంతపురం జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 126 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  515 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 

ఏ పార్టీకి ఎన్ని ఎంపీటీసీ స్థానాలంటే?
 ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4గంటల వరకు 3,923 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి.  వైకాపా అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైకాపా అభ్యర్థులు 3,398 స్థానాల్లో విజయం సాధించారు.  తెదేపా అభ్యర్థులు 395 స్థానాల్లో , కాంగ్రెస్‌ 3, భాజపా 14, జనసేన 17, సీపీఐ 9, సీపీఎం 7, ఇతరులు 80 స్థానాల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని