AP News: కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మొలకలపల్లె గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మురళిని వైకాపానేత, రెస్కో చైర్మన్, అతని అనుచరులు కిడ్నాప్ చేసి  దాడి చేయడాన్ని

Published : 26 Dec 2021 01:27 IST

కుప్పం పట్టణం : చిత్తూరు జిల్లా కుప్పం మండలం మొలకలపల్లె గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మురళిని వైకాపానేత, రెస్కో చైర్మన్, అతని అనుచరులు కిడ్నాప్ చేసి  దాడి చేయడాన్ని నిరసిస్తూ కుప్పం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పారు. గుడుపల్లి మండలం సోడిగానిపల్లె గ్రామానికి చెందిన పాపన్న.. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అతన్ని నిలువరించి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. మురళిపై దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగిందని, బాధితుడికి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో తెదేపా శ్రేణులు ఆందోళన విరమించారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం, పీఏ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నాలుగు మండలాల తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని