AP News: లాభదాయక పోర్టులో వాటా ఎందుకు అమ్ముతున్నారు?: పట్టాభి

గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్‌ సేల్‌ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా

Updated : 27 Dec 2021 14:04 IST

అమరావతి: గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్‌ సేల్‌ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు. అయిన వారికి దోచి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మైనర్‌ పోర్టులను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి 10.4శాతం వాటా ఉంది. రుణభారం లేని పోర్టులోని రాష్ట్ర వాటా ఎందుకు అమ్మాల్సి వచ్చింది? లాభదాయక పోర్టులో రాష్ట్ర వాటా ఎందుకు అమ్ముతున్నారు?’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని