Revanth Reddy: కేసీఆర్‌ దత్తత గ్రామంలో దళిత, గిరిజన దీక్ష: రేవంత్‌

సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష..

Published : 23 Aug 2021 01:23 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష చేపడతామని.. ఆ గ్రామం దుస్థితిని మీడియాకు చూపిస్తామన్నారు. గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌ అవినీతిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తెరాస, భాజపావి కొనుగోలు రాజకీయాలన్నారు. ఎస్సీలకు ఇచ్చిన హామీని కేసీఆర్‌ అమలు చేయలేదని.. ఎస్సీలకు ఆయన ఎంత సేవ చేసినా తక్కువేనని చెప్పారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంచి అధికారి అని.. కేసీఆర్‌ అరాచకాలతోనే ఆయన బయటకు వచ్చారన్నారు. పీసీసీ పూర్తిస్థాయి కమిటీకి ఇంకా సమయముందని.. ప్రజా సమస్యల పోరాటంపైనే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించామని రేవంత్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని