Telangana News: బలం ఉందని ఏకపక్షంగా పోతే పతనం తప్పదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బాగా పనిచేసే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పర్యాటక రంగంలో

Published : 28 Sep 2022 01:27 IST

దిల్లీ: బాగా పనిచేసే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పర్యాటక రంగంలో నాలుగు అవార్డులను సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మంత్రి అవార్డు అందుకున్నారు. కేంద్రం 20 విభాగాల్లో అవార్డులు ప్రకటిస్తే అందులో రాష్ట్రానికి 13 అవార్డులు దక్కాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ... ‘‘24గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చారా?బాగా పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహించకుండా వివక్ష చూపడం తగదు. ప్రపంచ స్థాయి అవార్డులు ఇస్తే దేశానికి ఎన్ని వస్తాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేంద్రంలోని భాజపా కక్షపూరిత రాజకీయం చేస్తోంది. ఒకప్పుడు 90శాతం సీట్లు ఉన్న కాంగ్రెస్‌  ఇవాళ పడిపోలేదా? బలం ఉందని ఏకపక్షంగా పోతే భాజపాకు పతనం తప్పదు’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని