UP Assembly: యూపీ చట్టసభల్లో ‘ఆమె’ కోసం ఒక రోజు..!

ఉత్తరప్రదేశ్‌ చట్టసభల్లో మహిళా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాయి. ఈ మేరకు గురువారం ఆ

Published : 23 Sep 2022 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ చట్టసభల్లో మహిళా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాయి. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్రంలోని రెండు సభలు (అసెంబ్లీ, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘‘చట్టసభల్లో పురుష సభ్యుల ఆధిపత్యంతో మహిళా సభ్యుల గొంతు వినపడకపోవడం మనం చూశాం. కానీ, ఈ రోజు మహిళా సభ్యుల మాటలు వింటూ వారు తమ తప్పును గుర్తించాలి’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మహిళలపై హింస, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ సభ్యురాలు ఆరాధన మిశ్రా ద్రవ్యోల్బణంపై మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని , నిరుద్యోగాన్ని కట్టడి చేయాలన్నారు. మహిళలు ఇంటి బడ్జెట్‌ను నిర్వహిస్తారని.. మరో పక్క గ్యాస్‌, వంటనూనెల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడేందుకు కేటాయించిన ఒక్క రోజు ఏమాత్రం చాలదని ప్రతిపక్ష నేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా మహిళలపై నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 403 సభ్యులున్న యూపీ అసెంబ్లీలో 47 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 22 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక లెజిస్లేటివ్‌ కౌన్సిల్లో 100 మంది సభ్యులుండగా.. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని