UP elections: 2022లో ప్రజాస్వామిక విప్లవమే!

వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి....

Published : 01 Jul 2021 01:24 IST

ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రతికూల రాజకీయాలకు వ్యతిరేకంగా 2022లో ప్రజాస్వామిక విప్లవం రాబోతోందని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు.

భాజపా పాలనలో అణచివేత, కొత్త రాజకీయాల పేరిట దోపిడీ, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఏకమై కొత్త రాజకీయాలకు పురుడు పోస్తారన్నారు. 2022లో యూపీలో ఎన్నికలు కాదు.. ప్రజాస్వామిక విప్లవం వస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, యూపీలో జరగబోయే ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను తమ పార్టీ 350 సీట్లు గెలుచుకుంటుందని అఖిలేశ్‌ విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని