దుబ్బాకలో ఎవరికి ఎన్ని ఓట్లొచ్చాయంటే? 

దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్‌ రావు గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

Published : 11 Nov 2020 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్‌ రావు గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆయనకు మొత్తంగా 63,352 ఓట్లు (38.47శాతం) వచ్చినట్టు వెల్లడించింది. తెరాస అభ్యర్థి సుజాతకు 62,273 ఓట్లు (37.82శాతం) రావడంతో ఆమె రెండో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి 22,196 ( 13.48శాతం) ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి కత్తి కార్తికకు 636 (0.39శాతం) ఓట్లు రాగా.. నోటాకు 554 ఓట్లు (0.34శాతం ) వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు 15,658 (9.5శాతం) ఓట్లు వచ్చినట్టు ఈసీ వెల్లడించింది. స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికంగా బండారు నాగరాజుకు 3570 ఓట్లు వచ్చాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. తెరాస, భాజపా మధ్య ఆఖరు రౌండ్‌ దాకా సాగిన ఉత్కంఠ పోరులో భాజపా అభ్యర్థి రఘునందన్‌ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని