YS Sharmila: పింఛన్లు డీబీటీ ద్వారా పంపిణీ చేయాలి: వైఎస్‌ షర్మిల

పింఛన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Updated : 01 Apr 2024 15:25 IST

దిల్లీ: పింఛన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. దిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడారు.

‘‘పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ విషయంపై సీఎస్‌తో మాట్లాడాను. 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులు పింఛను అందుకునేందుకు 10 రోజులు నిరీక్షించాలా? డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ఇవ్వాలని ఈసీ ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయడం లేదు? డీబీటీ ద్వారా వెంటనే పింఛన్లను పంపిణీ చేయాలి. లేకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతాం’’ అని షర్మిల హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని