YS Sharmila: బాబాయి హత్యపై జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారు: షర్మిల

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డికి సీఎం జగన్‌ టికెట్‌ ఎలా ఇస్తారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Published : 06 Apr 2024 14:16 IST

కడప: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డికి సీఎం జగన్‌ టికెట్‌ ఎలా ఇస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడారు. వివేకా కేసులో అవినాశ్‌ను సీబీఐ నిందితుడిగా తేల్చిందన్నారు. బాబాయి హత్య విషయంలో జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని కోరారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

‘‘ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన జగన్‌.. ఒక్కటైనా నెరవేర్చారా?. ముస్లింల పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమే. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడలేదు. కడప ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్సార్‌లా సేవ చేస్తా’’ అని షర్మిల అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని