Palnadu: వైకాపాలో వర్గ పోరు.. ఉద్రిక్తతల మధ్య విజయసాయిరెడ్డితో అసమ్మతి వర్గం భేటీ

పల్నాడు జిల్లాలో వైకాపానేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉద్రిక్తతల మధ్య విజయసాయిరెడ్డితో మంత్రి విడదల రజిని వ్యతిరేక వర్గం భేటీ అయింది.

Updated : 24 Aug 2023 22:48 IST

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వైకాపానేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నరసరావుపేటలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రాజ్యసభ సభ్యుడు, పల్నాడు జిల్లా రీజియన్‌ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి రెండ్రోజుల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ, స్థానిక పరిస్థితులపై నాయకులతో విడివిడిగా చర్చించారు.

మంత్రి విడదల రజిని వైఖరికి వ్యతిరేకంగా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి అసమ్మతి వర్గం నాయకులు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అసమ్మతి వర్గం సమావేశంలోకి వెళ్లకుండా రజిని వర్గీయులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసమ్మతి వర్గం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. మంత్రి రజిని అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనతో నరసరావుపేటలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల యూత్‌ జోనల్‌ ఇంఛార్జి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కార్యక్రమం చివర్లో విజయసాయిరెడ్డితో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమం మగిసిన తర్వాత మంత్రి రజిని అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళన మధ్యే అసమ్మతి నేతలు విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని