వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం ఎంతవరకు సమంజసం?

కార్యాలయానికి కూతవేటు దూరంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగితే వెంటనే స్పందించకుండా, ప్రతిపక్షనేత చంద్రబాబు పరామర్శకు వెళ్లినప్పుడు తాను కూడా వెళ్లి వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం ఎంతవరకు

Published : 27 Apr 2022 05:42 IST

మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు, మాజీ మంత్రి మణికుమారి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: కార్యాలయానికి కూతవేటు దూరంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగితే వెంటనే స్పందించకుండా, ప్రతిపక్షనేత చంద్రబాబు పరామర్శకు వెళ్లినప్పుడు తాను కూడా వెళ్లి వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం ఎంతవరకు సమంజసమని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను మాజీ మంత్రి, కమిషన్‌ మాజీ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి ప్రశ్నించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సమన్లు ఇచ్చానని గొప్పగా చెప్పుకోవడం కాదని, రాజకీయలకతీతంగా కమిషన్‌ చర్యలు చేపట్టాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రోజుకు 50 నుంచి 60 మందికి సమన్లు పంపుతున్నామని చెప్పిన కమిషన్‌ దృష్టికి అల్లూరి జిల్లా సీలేరు ఘటన కనిపించలేదా అని ప్రశ్నించారు. సీలేరు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చినా, ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయులకు సమన్లు ఎందుకు పంపలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు