చంద్రబాబు సీఎం అయితేనే యువతకు భవిత

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో ఉపాధి,

Published : 23 Jun 2022 06:06 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి : చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మానవవనరుల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో  ‘యువత- సాధికారత’ పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల మాఫియా చెలరేగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా యువకులతో మద్యం, చేపలు విక్రయిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు యువతకు మార్గనిర్దేశం చేశారు. కర్నూలు, నంద్యాల, కడప, హిందూపురం, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని తెలుగు యువత నాయకులు శిక్షణ పొందారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌ చినబాబు, విభాగం ఇన్‌ఛార్జి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని