చిక్కిపోయిన ‘సుగంధం’

సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఎగుమతులు 2020-21లో 31వేల కోట్లకు ఎగబాకాయి. మునుపెన్నడూ లేనివిధంగా కొవిడ్‌ సమయంలోనూ 40% వృధ్ధి నమోదైంది.  దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం

Published : 27 Jun 2022 05:16 IST

దేశవ్యాప్తంగా తగ్గిన ఎగుమతులు

ఈనాడు - అమరావతి

సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఎగుమతులు 2020-21లో 31వేల కోట్లకు ఎగబాకాయి. మునుపెన్నడూ లేనివిధంగా కొవిడ్‌ సమయంలోనూ 40% వృధ్ధి నమోదైంది.  దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఎగుమతులు అంతంతమాత్రంగానే సాగాయి. పలు రకాల సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. భారత్‌ నుంచి పరిమాణం, విలువలో అధిక వాటా ఉన్న మిరప ఎగుమతులు క్షీణించాయి. జీలకర్ర, పసుపు, ధనియాలు, మెంతుల ఎగుమతులూ తగ్గగా.. యాలకులు, మిరియాలు పెరిగాయి. 2017-18 నుంచి ఏటా ఎగుమతుల పరిమాణం, విలువ పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2020-21లో 5.50 లక్షల టన్నుల ఎగుమతులు పెరిగాయి. విలువ రూ.8,911 కోట్లు పెరిగి రూ.31వేల కోట్లకు చేరింది. అయితే 2020-21తో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల పరిమాణం 2,27,831 టన్నులు తగ్గింది. విలువలోనూ రూ.396.88 కోట్ల తగ్గుదల నమోదైంది.

జీలకర్ర కిందకే
వివిధరకాల సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఒడుదొడుకులు చోటు చేసుకున్నాయి. యాలకులు రూ.331 కోట్లు, మిరియాలు రూ.182 కోట్ల మేర ఎగుమతులు పెరిగాయి. పసుపు ఎగుమతులు 30,500 టన్నులు పడిపోయినా, విలువ పరంగా మాత్రం రూ.62 కోట్లు పెరిగింది. జీలకర్ర ఎగుమతులు రూ.907 కోట్ల మేర క్షీణించాయి. అల్లం ఎగుమతి పరిమాణం కాస్త పెరిగినా.. విలువ తగ్గింది. కరివేపాకు పొడి, పేస్టులదీ అదే పరిస్థితి. పుదీనా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఆధారిత నూనెల ఎగుమతులు రూ.1,847 కోట్లు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని