Goat: రూ.70 లక్షల మేక.. ప్రత్యేకతలివే..!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌.. బైజ్‌నాథ్‌ పరా మార్కెట్‌కు వచ్చిన ఓ మేక అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్‌ అనుప్పూర్‌కు చెందిన వాహిద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి.. మార్కెట్లో విక్రయించేందుకు తీసుకొచ్చిన తన మేకకు రూ.70లక్షలు ధర నిర్ణయించారు

Updated : 11 Jul 2022 09:23 IST

  విక్రయానికి వ్యాపారి నిర్ణయం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌.. బైజ్‌నాథ్‌ పరా మార్కెట్‌కు వచ్చిన ఓ మేక అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్‌ అనుప్పూర్‌కు చెందిన వాహిద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి.. మార్కెట్లో విక్రయించేందుకు తీసుకొచ్చిన తన మేకకు రూ.70లక్షలు ధర నిర్ణయించారు. ఈ మేకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ‘‘మేక స్వదేశీ జాతికి చెందినది. ఈ మేక ప్రకృతి ప్రసాదం. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్‌ అని రాసి ఉంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది. కాబట్టే దీని ధరను రూ.70 లక్షలుగా నిర్ణయించా. సోషల్‌ మీడియాలో మేక చిత్రాన్ని పోస్టు చేశా. ఆ చిత్రాన్ని చూసి నాగపుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. రూ.22 లక్షలకు మేకను కొనుగోలు చేస్తానన్నాడు. ఆ ధరకు అమ్మేందుకు నేను అంగీకరించలేదు. ఈ మేకకు మరింత ఎక్కువ ధర లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని వాహిద్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని