Army: జవాన్‌ పెళ్లి కోసం ఆర్మీ ఏం చేసిందో తెలుసా..?

పెళ్లి చేసుకొనేందుకు ఇంటికెళ్లాల్సిన ఓ జవాన్‌ కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను నడిపింది భారత సైన్యం. జమ్ము-కశ్మీర్‌లోని మచిల్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద నారాయణ బెహెరా బీఎస్‌ఎఫ్‌ సైనికుడిగా

Published : 29 Apr 2022 07:18 IST

శ్రీనగర్‌: పెళ్లి చేసుకొనేందుకు ఇంటికెళ్లాల్సిన ఓ జవాన్‌ కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను నడిపింది భారత సైన్యం. జమ్ము-కశ్మీర్‌లోని మచిల్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద నారాయణ బెహెరా బీఎస్‌ఎఫ్‌ సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మే 2న ఒడిశాలోని స్వగ్రామంలో అతని వివాహం నిశ్చయమైంది. అయితే నారాయణ ఉన్న ఎత్తయిన ప్రదేశం ప్రస్తుతం మంచుతో నిండిపోయి రహదారి మార్గం మూసుకుపోయింది. దీంతో వివాహానికి వరుడు హాజరయ్యేది సందిగ్ధంగా మారింది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. తమ కుమారుడు వచ్చేలా చూడాలని అతని తల్లిదండ్రులు ఆర్మీ అధికారుల్ని కోరారు. స్పందించిన బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రాజాబాబు సింగ్‌.. శ్రీనగర్‌లో ఉన్న చీతా హెలికాప్టర్‌లో నారాయణ బెహెరాను తరలించాలని ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున అతన్ని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడినుంచి ఒడిశా దెంకనల్‌ జిల్లాలోని ఆదిపూర్‌ గ్రామానికి బయలుదేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని