
స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!
వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ వెల్లడి
లండన్: మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా మసలిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ సోమవారం సూచించింది. మంకీపాక్స్ వ్యాధిగ్రస్తునితో ఇంట్లో కానీ, వెలుపల కానీ సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసిందీ సంబంధిత అధికారులకు తెలపాలనీ పేర్కొంది. అటువంటి వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని ఆ సంస్థ సలహా ఇచ్చింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్‌లకు పాకింది. బ్రిటన్‌లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా వెళ్లిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా అది సోకుతుంది. ఇటీవల స్పెయిన్, బెల్జియంలలో జరిగిన రెండు రేవ్ పార్టీలలో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ డేవిడ్ హైమాన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి. అలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా, పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా, ఇతరత్రా దగ్గరకు వెళ్లినా మంకీపాక్స్ సోకుతుంది.
ఇవీ లక్షణాలు
అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు మంకీపాక్స్ లక్షణాలు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది. పిల్లల్లో మాత్రం తీవ్రత ఎక్కువ. సాధారణ జనాభాకు ఈ వ్యాధి వల్ల ప్రమాదం తక్కువే. అయినప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండటం మంచిదని బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధానాధికారి సూజన్ హాప్కిన్స్ సలహా ఇచ్చారు. మంకీపాక్స్ కోవిడ్ లాంటిది కాదనీ, అది గాలి ద్వారా వ్యాపించదనీ, దాన్ని కట్టడి చేసే టీకాలు మనవద్ద ఉన్నాయని డాక్టర్ హైమాన్ పేర్కొన్నారు.
మశూచి టీకాతో రక్షణ
మంకీ పాక్స్ వ్యాధిగ్రస్తులకు సమీపంగా వెళ్లిన వారికి మశూచి టీకాలు ఇస్తున్నారు. లక్షణాలు కనిపించిన నాలుగైదు రోజుల్లో టీకా ఇస్తున్నందున వారికి మంకీపాక్స్ నుంచి రక్షణ లభిస్తోంది. ప్రస్తుతానికి జనాభా అంతటికీ మశూచి టీకాలు ఇవ్వడం లేదని బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధానాధికారి సూజన్ హాప్కిన్స్ చెప్పారు. మశూచి టీకాలు మంకీపాక్స్ నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తున్నందున అనేక దేశాలు ఆ టీకాలను నిల్వచేయనారంభించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్‌లో చూడొచ్చు
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..