రెండున్నరేళ్ల బాలుడిని బలిచ్చిన తాంత్రికుడు

రెండున్నరేళ్ల బాలుడిని ఓ తాంత్రికుడు దేవతకు బలిచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖేరాగడ్‌ తహసీల్‌ పరిధిలోని బరిగ్వా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే హుకం సింగ్‌ అనే వ్యక్తి భూతవైద్యుడిగా చలామణీ అవుతున్నాడు.

Published : 29 Jun 2022 05:57 IST

రెండున్నరేళ్ల బాలుడిని ఓ తాంత్రికుడు దేవతకు బలిచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖేరాగడ్‌ తహసీల్‌ పరిధిలోని బరిగ్వా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే హుకం సింగ్‌ అనే వ్యక్తి భూతవైద్యుడిగా చలామణీ అవుతున్నాడు. కొద్దిరోజులుగా అతని వద్దకు ఎవరూ వెళ్లడం లేదు. దీంతో చిన్నారిని దేవతకు బలిస్తే మంచి జరుగుతుందని భావించాడు. ఈ మేరకు రామ్‌ అవతార్‌ కుమారుడు హృతిక్‌ జూన్‌ 15న ఓ బావి సమీపంలో ఆడుకుంటూ కనిపించాడు. ఎవరూ లేరని గమనించి అతడిని ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలుడిని గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి చామఢ్‌ మాతా పాదాల ముందు ఉంచాడు. జూన్‌ 16న వేకువజామున బాలుడి శవాన్ని ఊరికి దూరంగా ఎండిపోయిన కాలువలో పడేశాడు. అడవి జంతువులు శవాన్ని తింటే ఎలాంటి ఆనవాళ్లు ఉండవని భావించాడు. ఈ క్రమంలో శెరూ అనే వ్యక్తి కంటపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, మీ కుటుంబసభ్యులను రోజుకొకరి చొప్పున దేవతకు బలిస్తానని బెదిరించాడు. కానీ అతడు ధైర్యంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు వెంటనే హుకం సింగ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు, ఆస్తి కోసమే హృతిక్‌ను తాంత్రికుడు బలిచ్చాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని