కన్హయ్య హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

కన్హయ్య హత్య కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆయన్ను చంపేందుకు పన్నిన కుట్రలో వారు భాగస్వాములని, ఆయన దుకాణం వద్ద గతంలో రెక్కీ కూడా

Published : 02 Jul 2022 06:34 IST

ఉదయ్‌పుర్‌: కన్హయ్య హత్య కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆయన్ను చంపేందుకు పన్నిన కుట్రలో వారు భాగస్వాములని, ఆయన దుకాణం వద్ద గతంలో రెక్కీ కూడా నిర్వహించారని తెలిపారు. అరెస్టయినవారి పేర్లను మొహ్సిన్‌, అసిఫ్‌లుగా పేర్కొన్నారు. కన్హయ్య హత్య కేసు డైరీని ఎన్‌ఐఏకు అప్పగించాల్సిందిగా రాజస్థాన్‌ పోలీసులను స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహమ్మద్‌లను అజ్‌మేర్‌లోని హైసెక్యూరిటీ జైలుకు తరలించారు.

* కన్హయ్యను హత్య చేసిన అనంతరం నిందితులిద్దరూ రియాజ్‌కు చెందిన మోటారుసైకిల్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారని పోలీసులు తాజాగా వెల్లడించారు. దాని రిజిస్ట్రేషన్‌ నంబరు ‘2611’ అని.. రూ.వెయ్యి పెట్టి అతడు ఆ సంఖ్యను దక్కించుకున్నాడని తెలిపారు. 2008 నాటి ముంబయి ఉగ్రదాడులకు సూచికగా దాన్ని సొంతం చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

* రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో గత నెల 3న విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇద్దరు ముస్లిం నేతలను (నదీమ్‌ అఖ్తర్‌, మహమ్మద్‌ ఆలం రజాక్‌ గోరీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిద్దరికి స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కన్హయ్య హత్య కేసులో తమకు సంబంధాలున్నట్లు వస్తున్న ఆరోపణలను పాకిస్థాన్‌కు చెందిన దావత్‌-ఎ-ఇస్లామీ సంస్థ ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని