గోవా అసెంబ్లీ బరిలో 5 జంటలు

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అయిదు జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాయి. ఎన్నికల్లో వీళ్లందరూ విజయం సాధిస్తే.. 

Published : 28 Jan 2022 10:53 IST

పణజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అయిదు జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాయి. ఎన్నికల్లో వీళ్లందరూ విజయం సాధిస్తే.. 40 ఎమ్మెల్యే స్థానాలున్న గోవా శాసనసభలో నాలుగోవంతు వీళ్లే అవుతారు. అధికార భాజపా రెండు జంటలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్ర ఆరోగ్యమంత్రి విశ్వజిత్‌ రాణె వాల్‌పోయ్‌ సెగ్మెంటు నుంచి పోటీలో ఉండగా.. ఆయన భార్య దేవియా పోరియెం నుంచి భాజపా అభ్యర్థిగా మొదటిసారి బరిలోకి దిగారు. అటనాసో మాన్సరెట్, జెన్నిఫర్‌ దంపతులను పణజీ, తాలెయిగావో స్థానాల నుంచి భాజపా బరిలోకి దించింది. ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్‌ కవ్లేకర్, సావిత్రి కవ్లేకర్‌ దంపతులు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. చంద్రకాంత్‌కు ఆయన పాత నియోజకవర్గమైన క్యూపెమ్‌ టికెటును భాజపా కేటాయించింది. సావిత్రి సాంగెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. 

* కాంగ్రెస్‌ పార్టీ తరఫున మైఖేల్‌ లోబో, డెలీలాహ్‌ దంపతులు కలంగుట్, సియోలిమ్‌ నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. తృణమూల్‌.. కిరణ్‌ కందోల్కర్, కవిత దంపతులకు టికెట్లు కేటాయించింది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని