China: ప్రమాణాలకు అనుగుణంగానే టార్చ్‌బేరర్‌ నియామకం: చైనా

గల్వాన్‌ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రమేయమున్న

Updated : 08 Feb 2022 11:33 IST

బీజింగ్‌: గల్వాన్‌ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రమేయమున్న పీఎల్‌ఏ కర్నల్‌ క్వీ ఫాబోవాను.. వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌బేరర్‌గా నియమించడాన్ని చైనా సమర్థించుకుంది. ఇందులో రాజకీయ దురుద్దేశమేమీ లేదని చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం దీనిపై పాత్రికేయులు పలు ప్రశ్నలు సంధించగా లిజియాన్‌ పై విధంగా స్పందించారు. ‘‘ప్రమాణాలకు అనుగుణంగానే వింటర్‌ ఒలింపిక్స్‌లో కర్నల్‌ క్వీ ఫాబోవాను టార్చ్‌బేరర్‌గా నియమించాం. దీనిపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు’’ అంటూ లిజియాన్‌ స్పష్టంచేశారు. హేతుబద్ధమైన పద్ధతిలో దీన్ని చూడాలని కోరారు. టార్చ్‌బేరర్‌ నియామకం విషయంలో చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనబోమని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా సైతం చైనా నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన చైనా దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తూ.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు