ఔరా పాండ్య! స్వేదం చిందిస్తున్నావ్‌

దాదాపుగా ఏడాది! టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య చివరి టీ20 ఆడి. మొదట వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకొనేందుకు విరామం తీసుకున్నాడు. మార్చిలో ఐపీఎల్‌ దగ్గర పడటంతో వేగంగా కోలుకున్నాడు. స్థానిక డీవై పాటిల్‌ టీ20 క్రికెట్లో శతకాల మోత మోగించి కసిగా ఉన్నానని సందేశాలు...

Published : 13 Aug 2020 02:20 IST

దాదాపుగా ఏడాది! టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య చివరి టీ20 ఆడి. మొదట వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకొనేందుకు విరామం తీసుకున్నాడు. మార్చిలో ఐపీఎల్‌ దగ్గర పడటంతో వేగంగా కోలుకున్నాడు. స్థానిక డీవై పాటిల్‌ టీ20 క్రికెట్లో శతకాల మోత మోగించి కసిగా ఉన్నానని సందేశాలు పంపించాడు. ఇంతలోనే లాక్‌డౌన్‌ వచ్చేసింది. ఈ సమయంలోనే తనకు పెళ్లైందని, తన సతీమణి నటాషా స్టాంకోవిచ్‌ గర్భిణి అని షాకిచ్చాడు. తాజాగా అతడి భార్య మగబిడ్డకు జన్మనివ్వడంతో తండ్రి హోదా సంపాదించుకున్నాడు.

ఆ ఆనందంలో హార్దిక్‌ ఐపీఎల్‌కు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాడు. విపరీతంగా కసరత్తులు చేస్తున్నాడు. స్వేదం చిందిస్తున్నాడు. తన కసరత్తులకు సంబంధించిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘ప్రతీ ఇంచ్‌.. ప్రతీ రిపిటీషన్‌.. అన్నీ లెక్కలోకి వస్తాయి!’ అని వ్యాఖ్య జత చేశాడు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మాజీ క్రికెటర్‌ మునాఫ్‌ పటేల్‌, ఆసీస్‌ విధ్వంసకర క్రికెటర్‌ క్రిస్‌లిన్‌ అతడిని అభినందించారు.

ముంబయి ఇండియన్స్‌ విజయాల్లో హార్దిక్ ‌పాండ్యది కీలక పాత్ర. ఆల్‌రౌండర్‌గా బ్యాటు, బంతితో జట్టును ఆదుకుంటాడు. కేవలం పది నిమిషాల్లోనే మ్యాచ్‌ గమనం మార్చేస్తాడు. బౌలర్‌ ఎంతటివాడైనా కళ్లు చెదిరే సిక్సర్లు, అద్భుతమైన బౌండరీలు బాదేస్తూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తాడు. ఇక బంతితోనూ హవా కొనసాగిస్తాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. అందుకే ముంబయి ఆడే ప్రతి మ్యాచులో అతడికి చోటు కచ్చితంగా ఉంటుంది.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని