Team India: మనీశ్‌ను టాప్‌లో ఆడించొద్దు!

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా మనీశ్‌ పాండేను ఎంపిక చేస్తే టాప్‌లో కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించాలని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు...

Published : 18 Jul 2021 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా మనీశ్‌ పాండేను ఎంపిక చేస్తే టాప్‌లో కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించాలని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున టాప్‌ఆర్డర్‌లో బాగా ఆడతాడని, మిడిల్‌ ఆర్డర్‌లో పంపిస్తే పేలవంగా ఆడతాడని చెప్పాడు. ఒకవేళ అతడిని టాప్‌ ఆర్డర్‌లోనే పంపించాలని చూసినా జట్టు కష్టాలు తీరవని మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు.

టాప్‌ ఆర్డర్‌లో ఆడేందుకు పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారని, దాంతో మనీశ్‌ను మిడిల్‌ ఆర్డర్‌లో పంపాలన్నాడు. ‘మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ను తప్పకుండా ఆడిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మనీశ్‌పాండేను ఎంపిక చేస్తే కచ్చితంగా మిడిల్‌ ఆర్డర్‌లో అవకాశమివ్వాలి. అయితే, అతడిని టాప్‌ మూడులో ఆడనివ్వకూడదు. ఎందుకంటే మనీశ్‌ మిడిల్‌ ఆర్డర్‌లోనే సరిపోతాడు. అతడు అక్కడ ఆడితే మంచిది. లేకపోయినా ఫర్వాలేదు. అతడిని ఐదో స్థానంలో ఆడించి తర్వాత హార్దిక్‌ పాండ్యను ఆరో స్థానంలో కొనసాగించడం ఉత్తమం’ అని చోప్రా తన అభిప్రాయాలు వివరించాడు. కాగా టీమ్‌ఇండియా, శ్రీలంక జట్లు ఆదివారం నుంచి మూడు వన్డేలు.. ఆపై మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని యువ ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి. మరోవైపు ఓపెనర్లుగా ధావన్‌, పృథ్వీ బరిలోకి దిగుతారని ఇప్పటికే సమాచారం అందింది. దాంతో తర్వాతి స్థానాల్లో ఎవరు ఆడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని