Kuldeep Yadav: నేను మరీ అంత ఘోరమా?
ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కసారీ అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశపడ్డానని చైనామన్ బౌలర్ కుల్దీప్..
ధోనీ అనుభవాన్ని మిస్సవుతున్నా
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కసారీ అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశపడ్డానని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ‘నేను మరీ అంత ఘోరమా?’ అని బాధపడ్డానన్నాడు. వికెట్ల వెనకాల ఎంఎస్ ధోనీ అనుభవాన్ని తాను మిస్సవుతున్నానని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌కు మరింత అనుభవం వస్తే సలహాలు ఇస్తాడని వెల్లడించాడు.
కొన్ని నెలలుగా కుల్దీప్ యాదవ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. టీమ్ఇండియాకు ఎంపికవ్వడం లేదు. ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఎంఎస్ ధోనీ రిటైర్ అవ్వకముందు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మణికట్టు మాంత్రిక ద్వయంగా ప్రశంసలు అందుకున్నారు. కానీ వారిద్దరూ కలిసిఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. తాజాగా ఎంపిక చేసిన ఇంగ్లాండ్ సిరీసుకు కుల్దీప్ను పూర్తిగా పక్కన పెట్టేయడం గమనార్హం.
‘నా ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో నాకు చోటు లేకపోవడం నన్నుమరింత కలచివేసింది. నేనంత ఘోరంగా ఆడుతున్నానా అని ఆశ్చర్యపోయాను. ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం. వారి వద్దకు వెళ్లి అడగడం తప్పు. చెన్నై పిచ్ టర్న్‌కు అనుకూలిస్తుంది. అక్కడా నాకు చోటు దక్కకపోవడంతో షాకయ్యాను. కానీ చేసేదేం లేదు’ అని కుల్దీప్ అన్నాడు.
‘కొన్నిసార్లు నేను మహీభాయ్ మార్గనిర్దేశాన్ని మిస్సవుతాను. ఆయనది గొప్ప అనుభవం. వికెట్ల వెనకాల ఉండి మాకెప్పుడూ సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు రిషభ్ ఉన్నాడు. అతడు మరిన్ని మ్యాచులు ఆడితే భవిష్యత్తులో సలహాలు ఇవ్వగలడు. ప్రతి బౌలర్‌కు అవతలి ఎండ్‌లో భాగస్వామి ఉండాలని నా నమ్మకం. ధోనీ భాయ్ వీడ్కోలు పలికాక నేను, చాహల్ కలిసి ఆడలేదు. మొత్తంగా నా ప్రదర్శన చూస్తే ఫర్వాలేదు. కొన్నిసార్లు మాత్రం స్థాయికి తగ్గట్టు ఉండదు. మేం ఆడేటప్పుడు ప్రత్యర్థినీ చూడాలి’ అని కుల్దీప్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్