Ashwin: విష్ చేద్దామని ఫోన్‌కాల్ చేస్తే కట్‌ చేశాడు.. అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్ విమర్శలు

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)పై భారత మాజీ ఆటగాడు శివరామకృష్ణన్‌ విమర్శలు చేశాడు.  

Published : 06 Mar 2024 22:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న టీమ్ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) మరో మైలురాయికి అడుగు దూరంలో నిలిచాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య మార్చి 7 నుంచి ఐదో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అశ్విన్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్‌. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించబోతున్నాడు. దీంతో అశ్విన్‌కు అభిమానులు, క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కానీ, భారత మాజీ స్పిన్నర్‌ శివరామకృష్ణన్‌ అశ్విన్‌పై విమర్శలు చేశాడు. ‘‘100వ టెస్టు ఆడబోతున్న అశ్విన్‌కు విషెస్‌ చెబుదామని పలుమార్లు ఫోన్‌ కాల్ చేశాను. కానీ, అతడు కట్‌ చేశాడు. మెసేజ్‌ చేసినా బదులివ్వలేదు. మాజీ క్రికెటర్లమైన మాకు దక్కే గౌరవం ఇది’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X)లో పోస్టు పెట్టాడు. ‘‘కల్చర్‌ తెలిసిన వాళ్లకే ఎదుటివాళ్లను గౌరవించే సంస్కారం ఉంటుంది. గతంలో అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్ గురించి కొన్ని సూచనలు చేశా. అంతేకాని అతడిని విమర్శించలేదు’’ అని మరో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని