IND vs AUS: చాహల్‌కు మరోసారి నిరాశ.. ఎవరితోనైనా గొడవపడ్డాడేమో తెలియదు: భజ్జీ

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి రావడంతో యుజ్వేంద్ర చాహల్‌కు (Chahal) స్థానం దక్కడం లేదు. ఆసియా కప్‌లో ఆడలేకపోయిన చాహల్‌ ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ చోటు సంపాదించలేకపోయాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 19 Sep 2023 18:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల (IND vs AUS) సిరీస్‌కు ప్రకటించిన జట్టులో యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కలేదు. ఆసియా కప్‌లో (Asia Cup 2023) గాయపడిన అక్షర్ పటేల్‌ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకుంది. చాహల్‌ను (Chahal) ఎందుకు చేయలేదనేది తనకు అర్థం కావడం లేదని, జట్టులో ఉండదగిన ఆటగాళ్లలో అతడొకడని మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌ వ్యాఖ్యానించాడు. నైపుణ్యపరంగా భారత జట్టుకు ఎంపిక కావాల్సిన ఆటగాడని పేర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్‌లోనూ చాహల్‌కు అవకాశం దక్కని విషయం తెలిసిందే. 

‘‘చాహల్ జట్టులో ఉంటే బాగుండేది. అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకో కూడా అర్థం కావడం లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా..? అనేది తెలియడం లేదు. కేవలం మనం నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోకైనా తీసుకొంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. 

పాక్‌తో పోలిస్తే.. కొత్తబంతితో భారత్ బౌలింగ్‌ దాడే అద్భుతం:గావస్కర్

ఆసియా కప్‌లో విజయాలను అలవాటు చేసుకున్న భారత్‌ తప్పకుండా ఆసీస్‌ను ఓడిస్తుందనే నమ్మకం నాకుంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టు కాస్త బలహీనంగా ఉందనిపిస్తోంది. అయినా సరే స్వదేశంలో కాబట్టి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని మిగతా ఆటగాళ్లూ భావిస్తారు. తప్పకుండా విజేతగా నిలుస్తారు. ఆసీస్‌ను ఓడించాలంటే చాలా కష్టపడాలి. లోయర్‌ ఆర్డర్‌ వరకూ వారికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను ఓడిపోయినా సరే ఆసీస్‌ బలమైందే. ఎనిమిదో స్థానం వరకూ భారీగా హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు’’ అని హర్భజన్ సింగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని