Chris Morris : ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు

 దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ క్రికెట్‌కు రిటైర్‌మెంట్...

Published : 11 Jan 2022 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో అత్యధిక ధరను దక్కించుకుని చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. కెరీర్‌లో నాకు సహకరించిన ప్రతి ఆటగాడికి కృతజ్ఞతలు. ఇవాళ నా అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నా. కోచింగ్ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నా’’ అని పేర్కొన్నాడు. 

దక్షిణాఫ్రికా తరఫున 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన క్రిస్‌ మోరిస్‌ నాలుగు టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20లను ఆడాడు. చివరి సారిగా 2019 ప్రపంచకప్‌లో ఆడాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్‌ రాయల్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 ఐపీఎల్ సీజన్‌ కోసం జరిగిన వేలంలో రూ. 16.25 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకోవడంతో మోరిస్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక ధరను దక్కించుకున్న ఆటగాడిగా ఐపీఎల్‌ చరిత్రలోకెక్కాడు. అయితే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని