భారీ అంచనాలతో.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
ఇటీవల ముగిసిన ఓవల్ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్‌పై భారీ అంచనాలు పెట్టుకుని.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్కు : ఇటీవల ముగిసిన ఓవల్ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్‌పై భారీ అంచనాలు పెట్టుకుని.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌ను శార్థూల్ ఠాకూర్ చాలా గొప్పగా ప్రారంభించాడు. ఓవల్ టెస్టులో రెండు అర్ధ శతకాలు, రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే, అప్పుడే అతడిపై ఓ అంచనాకు వచ్చి మేటి ఆల్ రౌండర్‌గా ముద్ర వేసి ఒత్తిడి పెంచొద్దు. జట్టులో కుదురుకుని నిలకడైన ప్రదర్శన చేసేందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలి. ఈ తరం క్రికెట్‌కి ఎనిమిదో స్థానంలో బ్యాట్‌తో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చే మేటి ఆల్ రౌండర్ల అవసరం చాలా ఉంది. ఆ స్థానంలో ఆడేందుకు శార్థూల్ సరిగ్గా సరిపోతాడు. ప్రస్తుతానికి మరి కొన్ని మ్యాచుల్లో అతడిని ఎనిమిదో స్థానంలోనే ఆడిస్తూ.. బాగా రాణించేందుకు సహకరించాలి’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.