ఆ నిబంధనతో ప్రమాదమే

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వల్ల ఆల్‌రౌండర్‌ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు.

Published : 26 Apr 2024 02:16 IST

దిల్లీ: ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వల్ల ఆల్‌రౌండర్‌ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అక్షర్‌ బ్యాటింగ్‌లోనూ సమర్థుడే అన్న సంగతి తెలిసిందే. బుధవారం టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతడు 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన గురించి అక్షర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వల్ల ఆల్‌రౌండర్‌ పాత్ర ప్రమాదంలో పడిందన్నది ఒక ఆల్‌రౌండర్‌గా నా భావన. ప్రతి జట్టు కూడా పూర్తి స్థాయి బ్యాటర్‌ లేదా పూర్తి స్థాయి బౌలర్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించాలని చూస్తోంది. ఆల్‌రౌండర్‌ను ఉపయోగించుకోవట్లేదు. ఈ నిబంధన వల్ల ప్రతి జట్టులో ఆరుగురు బ్యాటర్లు, అంతే సంఖ్యలో బౌలర్లు ఉన్నట్లు అవుతోంది. దీంతో చాలా గందరగోళం కూడా నెలకొంటోంది’’ అని చెప్పాడు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, అనేక మంది మాజీ ఆటగాళ్లు కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని