ట్రయల్స్‌లో అర్జున్‌ రికార్డు స్కోరు

ఒలింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు.

Published : 26 Apr 2024 02:15 IST

దిల్లీ: ఒలింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. అతడు 2.8 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్‌ రుద్రాంక్ష్ను ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్‌ కోటా విజేత అయిన అర్జున్‌.. దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ రికార్డు (253.7)ను అధిగమించాడు. మహిళల రైఫిల్‌లో నాన్సీ మంధోత్ర (253.4) 0.7 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత విజేత మెహులి ఘోష్‌ను ఓడించి అగ్రస్థానం సాధించింది. పురుషుల ఎయిర్‌ పిస్టల్‌లో వరుణ్‌ తోమర్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 244.1 పాయింట్లు స్కోర్‌ చేశాడు. మహిళల ఎయిర్‌ పిస్టల్‌లో రిథమ్‌ సాంగ్వాన్‌ విజయం సాధించింది. 5.7 పాయింట్లతో ఆమె మను బాకర్‌ను రెండో స్థానానికి నెట్టింది. ఆసియా క్రీడల స్వర్ణ విజేత పలక్‌ గులియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని