ఫైనల్లో ధీరజ్‌ బృందం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్‌ జట్టు సత్తా చాటింది.

Published : 26 Apr 2024 02:17 IST

ఆర్చరీ ప్రపంచకప్‌

షాంగై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్‌ జట్టు సత్తా చాటింది. తెలుగుతేజం బొమ్మదేవర ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన బృందం పసిడి పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీస్‌లో భారత్‌ 5-1తో ఇటలీని ఓడించింది. స్వర్ణంతో కోసం బలమైన దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రికర్వ్‌ మహిళల టీమ్‌ విభాగంలో భారత్‌ (దీపిక కుమారి, అంకిత బాకత్‌, భజన్‌కౌర్‌) నిరాశ పరిచింది. తొలి రౌండ్లో 3-5తో మెక్సికో చేతిలో ఓడింది. కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె 143-142తో సహచర ఆర్చర్‌ అవ్‌నీత్‌ కౌర్‌ను ఓడించింది. టీమ్‌ ఈవెంట్లో జ్యోతి బృందం ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు అదితి 142-144తో ఆండ్రియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాంశు సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో అతడు 145-145తో బతుహాన్‌ (టర్కీ)తో సమంగా నిలిచాడు. కానీ షూటాఫ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఇంకోవైపు ప్రథమేశ్‌ 147-148తో కాపెర్స్‌ (అమెరికా) చేతిలో ఓడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని