Hardik Pandya: వావ్‌.. నేను అన్ని అర్ధ శతకాలు నమోదు చేశానా? : హార్దిక్‌ పాండ్య

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో మంబయి జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్న హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) అభిమానులతో సరదాగా ముచ్చటించాడు.

Updated : 04 Mar 2024 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ 2024(IPL 2024) సమరం వచ్చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సీజన్‌ కోసం ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. గుజరాత్‌(Gujarat Titans) జట్టు నుంచి ముంబయి(Mumbai Indians)కి తిరిగివచ్చి.. అనూహ్యంగా సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) ఆ జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓ క్రీడా ఛానల్‌లో అభిమానులకు నిర్వహించిన క్విజ్‌లో పాల్గొని సరదాగా వారితో ముచ్చటించాడు.

సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు..

ఈ టోర్నీలో హార్దిక్‌ ఎన్ని అర్థ శతకాలు నమోదుచేశాడని అడగ్గా.. 10 అని ఒకరు సమాధానం చెప్పారు. ఇది విన్న హార్దిక్‌ ఆశ్చర్యంగా ‘నేను అన్ని చేశానా?.. వావ్‌’ అన్నాడు. మీకు ఇష్టమైన అర్ధ శతకం ఏది..? రాజస్థాన్‌పై 2020లో 21 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్‌ గురించి స్పందించాలని అభిమానులు పాండ్యను కోరగా.. ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.   ‘ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. నాకు అర్ధ శతకాలు, శతకాలపై నమ్మకం లేదు. అవి నంబర్లు మాత్రమే. వాటి గురించి చర్చించడమంటే సమయం వృథానే’ అంటూ పేర్కొన్నాడు.

ఈనెల 22 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముంబయి ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను 24న గుజరాత్‌ టైటాన్స్‌తోనే ఆడనుంది. అదే జట్టు నుంచి ముంబయికి తిరిగి వచ్చిన హార్దిక్‌.. తన టీమ్‌ను ఎలా సిద్ధం చేస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని