భారత అభిమానులు.. బాధపడకండి!
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు...
ఇంటర్నెట్‌డెస్క్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. అయితే టీమిండియా అభిమానులు ఫలితంపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంటున్నాడు. గత సిరీస్‌ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినా భారత్ సిరీస్ సాధించిందని గుర్తు చేస్తున్నాడు. భారత్×ఇంగ్లాండ్ టెస్టుపై మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే...
‘‘భారత అభిమానులు బాధపడకండి. గత సిరీస్‌లో తొలి టెస్టు ఓటమిపాలైనప్పటికీ సిరీస్ మనమే గెలిచాం (ఆస్ట్రేలియా పర్యటన గురించి). అయితే భారత్‌లో భారత్‌ను సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓడించడం అంత సులువు కాదు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. వాళ్లకి అభినందనలు. ఈ టెస్టు ఇంగ్లాండ్ గొప్ప విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ - వసీమ్ జాఫర్
‘‘అండర్సన్ ఎప్పటికీ మా అత్యుత్తమ బౌలర్. ఇంగ్లాండ్‌కు శుభాకాంక్షలు. సంపూర్ణ విజయమిది - నాసర్ హుస్సేన్
‘‘అద్భుత ప్రదర్శనతో భారత్‌లో భారత్‌ను ఓడించారు. 227 పరుగుల తేడాతో విజయం. ఇంగ్లాండ్ జట్టు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సారథిగా 26వ టెస్టు విజయాన్ని అందుకున్న జో రూట్‌కు శుభాకాంక్షలు’’ - మైకేల్ వాన్
‘‘గొప్ప విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు అభినందనలు. సీనియర్ ఆటగాళ్లు రూట్, అండర్సన్ ముందుండి జట్టు బాధ్యతల్ని చక్కగా మోశారు. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు రాణించడానికి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నారు’’ - వీవీఎస్ లక్ష్మణ్
‘‘ఇంగ్లాండ్ గొప్పగా ఆడింది. గత మూడేళ్లలో స్వదేశంలో భారత్‌కు ఎదురైన బలమైన అభ్యర్థి ఇంగ్లాండ్’’ - హర్షా భోగ్లే
‘‘ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని’’ - కెవిన్ పీటర్సన్
‘‘టాస్ అనేది కీలకమే. కానీ ఓటమికి అదే కారణం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో చివరి మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడాం. అయినా రెండు టెస్టుల్లో విజయం సాధించాం. మరో టెస్టును డ్రాగా ముగించాం. అయితే ఇప్పుడు సిరీస్ స్వదేశంలో జరుగుతోంది. తొలి రెండు రోజుల్లో ఉన్నట్లుగా పిచ్ ఫ్లాట్, స్లోగా లేదు. ఇది భారత కఠినమైన పిచ్. కాగా, తొలి టెస్టులో ఇంగ్లాండ్ గొప్ప విజయం సాధించింది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది’’ - ఆకాశ్ చోప్రా
‘‘ఇంగ్లాండ్‌కు అభినందనలు. భారత్‌లో భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. ప్రత్యేకంగా ప్రస్తుత టీమిండియాని. అయితే ఇంకా మూడు మ్యాచ్‌లున్నాయి. జాగ్రత్తగా ఉండండి. టీమిండియా నుంచి గొప్ప పోరాటాన్ని ఆశిస్తున్నాం’’ - ఆర్పీ సింగ్
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!