Virat Kohli: అలా నిరూపించాల్సిన స్థితిలో లేను: కోహ్లీ

బయటకు వెళ్లి ఒకరిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో లేనని టీమ్‌ఇండియా అగ్రశ్రేణి బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు.

Updated : 14 Mar 2023 09:18 IST

అహ్మదాబాద్‌: బయటకు వెళ్లి ఒకరిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో లేనని టీమ్‌ఇండియా అగ్రశ్రేణి బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసిన అతను.. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

‘‘ఓ ఆటగాడిగా నాపై నాకున్న అంచనాలే నాకెంతో ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్లి ఒకరిని తప్పని నిరూపించాల్సిన స్థితిలో లేను. మైదానంలో ఉన్నందుకు తగిన న్యాయం చేయాలి. టెస్టు క్రికెట్లో గత పదేళ్లుగా ఆడినట్లు ఇటీవల కాలంలో ఆడలేకపోయా. తిరిగి ఆ ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నించా. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నాగ్‌పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌ నుంచి ఉత్తమంగానే బ్యాటింగ్‌ చేశాననుకుంటున్నా’’ అని సోమవారం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన విరాట్‌ తెలిపాడు.

గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్‌ కొనసాగించాలనుకున్నట్లు ఈ ఇన్నింగ్స్‌లో 364 బంతులు ఎదుర్కొన్న కోహ్లి చెప్పాడు. ‘‘గాయంతో శ్రేయస్‌ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం లేకపోవడంతో ఓ బ్యాటర్‌ తక్కువయ్యాడు. కాబట్టి ఎక్కువ సేపు ఆడడంపై దృష్టి పెట్టాం. వీలైనంత సేపు జట్టు కోసం క్రీజులో ఉండాలనుకున్నాం. నేను ఆ పనే చేశా. కానీ గతంలో లాగా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయా. ఆ విధంగా చూస్తే నిరాశ కలుగుతోంది. కానీ ఉత్తమంగానే ఆడుతున్నాననే నమ్మకమూ వచ్చింది’’ అని కోహ్లి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని