శ్రీకాంత్‌ ఔట్‌

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీ నుంచి   భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌, పి.వి.సింధు నిష్క్రమించారు.

Published : 24 Mar 2023 03:27 IST

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీ నుంచి   భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌, పి.వి.సింధు నిష్క్రమించారు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 20-22, 17-21తో లీ చుక్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌ తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ గట్టిగా పోరాడాడు. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలు చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. అయిదో సీడ్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 8-21, 8-21తో అన్‌ సీడెడ్‌ క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌ జంట 12-21, 21-17, 28-26తో ఫాంగ్‌ చి, ఫాంగ్‌ జెన్‌ (తైపీ)పై పోరాడి గెలిచారు. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. మూడు గేమ్‌ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 15-21, 21-12, 18-21తో వర్దని (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది. అంతకుముందు తొలి రౌండ్లో సింధు 21-9, 21-16తో జెజీర స్టాడెల్‌మన్‌  (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించింది. ఆకర్షి కశ్యప్‌ 15-21, 17-21తో యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని