నేనైతే శుభ్‌మన్‌నే ఎంచుకుంటా: శిఖర్‌

తానే సెలక్టర్‌ని అయితే ధావన్‌కు బదులు శుభ్‌మన్‌ గిల్‌నే జట్టులో ఎంచుకుంటానని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు.

Published : 27 Mar 2023 02:16 IST

దిల్లీ: తానే సెలక్టర్‌ని అయితే ధావన్‌కు బదులు శుభ్‌మన్‌ గిల్‌నే జట్టులో ఎంచుకుంటానని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. మూడు ఫార్మాట్లలో గొప్పగా రాణిస్తున్న 23 ఏళ్ల గిల్‌ సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడే జట్టులో దాదాపు స్థానం ఖరారు చేసుకున్నాడు. ‘‘శుభ్‌మన్‌ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు. అతడు వరుసగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. నేను ఆడట్లేదు. ఒకవేళ నేనే సెలక్టర్‌ని అయితే ధావన్‌కు బదులు శుభ్‌మన్‌ని జట్టులోకి తీసుకుంటాను. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నన్నెంతో ప్రోత్సహించారు. వన్డే ప్రపంచకప్‌పై దృష్టితో ఆడాలని చెప్పారు. 2022లో వన్డేలో స్థిరంగా రాణించా. కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగాడు. నా స్థానాన్ని భర్తీ చేస్తూ సత్తా చాటాడు. కెరీర్‌లో ఇలాంటివి మామూలే. బంగ్లాదేశ్‌పై వన్డేలో ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ చేసినప్పుడే జట్టులో ఇక చోటు కష్టమనిపించింది’’ అని శిఖర్‌ చెప్పాడు. గతేడాది డిసెంబర్‌లో ఈ ఓపెనర్‌ తన చివరి వన్డే ఆడాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని