Mitchell Marsh: కప్పుపై కాళ్లేసి..

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Updated : 21 Nov 2023 04:28 IST

అహ్మదాబాద్‌: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆదివారం ఫైనల్లో విజేతగా నిలిచిన తర్వాత ట్రోఫీతో మార్ష్‌ దిగిన ఫొటో నెట్టింట్లో దుమారం రేపుతోంది. మెడలో పతకం.. చేతిలో బీరు సీసాతో సోఫాలో కూర్చున్న మార్ష్‌ తన రెండు కాళ్లను ప్రపంచకప్‌పై పెట్టడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘క్రికెట్లో అతిపెద్ద ట్రోఫీని ఆసీస్‌ గెలుచుకోవచ్చు. కానీ గౌరవాన్ని కాదు’’, ‘‘మన, వారి సంస్కృతికి మధ్య ఇదే వ్యత్యాసం’’ అంటూ అభిమానులు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని