Shubman Gill: గిల్‌ 400 చేయగలడు

sక్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ బద్దలు కొడతాడని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

Updated : 07 Dec 2023 09:45 IST

కోల్‌కతా: క్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ బద్దలు కొడతాడని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ లారా పేరిటే రికార్డు ఉంది. 1994లో డర్హమ్‌తో కౌంటీ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ తరఫున లారా అజేయంగా 501 స్కోరు సాధించాడు. ‘‘నా రెండు రికార్డుల్ని గిల్‌ బద్దలు కొట్టగలడు. ఈ తరం ఆటగాళ్లలో గిల్‌ అత్యంత ప్రతిభావంతుడు. రానున్న కాలంలో క్రికెట్‌ను శాసిస్తాడు. చాలా పెద్ద రికార్డుల్ని తిరగ రాస్తాడని నమ్ముతున్నా. ప్రపంచకప్‌లో గిల్‌ సెంచరీ చేయకపోవచ్చు. కాని అతను మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐసీసీ టోర్నీల్లోనూ అలాంటి చాలా ఇన్నింగ్స్‌లు ఆడతాడు’’ అని లారా కితాబిచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని