Jasprit Bumrah: అలాగైతే నాకు వికెట్లే వికెట్లు: బుమ్రా

టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహాన్ని అనుసరిస్తే తనకు చాలా వికెట్లు లభిస్తాయని టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు.

Updated : 24 Jan 2024 08:00 IST

హైదరాబాద్‌: టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహాన్ని అనుసరిస్తే తనకు చాలా వికెట్లు లభిస్తాయని టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. భారత్‌లో కూడా దూకుడుగా బ్యాటింగ్‌ చేయడానికి ఇంగ్లాండ్‌ సిద్ధమవుతున్న నేపథ్యంలో బుమ్రా ఇలా స్పందించాడు. ‘‘బజ్‌బాల్‌ అన్న పదాన్ని నేను పట్టించుకోను. కానీ ఇంగ్లాండ్‌ బాగా ఆడుతోంది. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను ఎదుర్కొంటోంది. మరో విధంగా కూడా టెస్టు క్రికెట్‌ ఆడొచ్చని ప్రపంచానికి చూపెడుతోంది. కానీ వాళ్లు వేగంగా ఆడితే నన్ను అలసిపోయేలా చేయలేరని, నాకు చాలా వికెట్లు దక్కుతాయని ఒక బౌలర్‌గా నేను ఆలోచిస్తా. పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా’’ అని బుమ్రా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని