PCB: భారత్‌ తలుచుకుంటే మేం కుప్పకూలుతాం

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా అన్నాడు.

Updated : 09 Oct 2021 07:05 IST

కరాచి: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్‌ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90 శాతం భారత్‌ నుంచే వస్తుంది. ఇది భయపెట్టే విషయం. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత వ్యాపార సంస్థలే. రేప్పొద్దున భారత ప్రధాని పాక్‌కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుంది’’ అని రమీజ్‌ అన్నాడు. గత నెలలో తమ దేశ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని వెళ్లిపోయిన న్యూజిలాండ్‌.. ఆ సిరీస్‌ను రీషెడ్యూల్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని రమీజ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని