T20 World Cup: కోహ్లి చెప్పాడు.. ఓపెనర్‌ నేనే

త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఓపెనర్‌ పాత్ర కోసమే తనను ఎంచుకున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తనతో చెప్పాడని యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. ఐపీఎల్‌-14లో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమైన కిషన్‌..

Published : 10 Oct 2021 08:39 IST

అబుదాబి: త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఓపెనర్‌ పాత్ర కోసమే తనను ఎంచుకున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తనతో చెప్పాడని యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. ఐపీఎల్‌-14లో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమైన కిషన్‌.. చివరి రెండు మ్యాచ్‌ల్లో (50, 84) చెలరేగాడు. చివరగా బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కిషన్‌ విఫలమవగా.. మ్యాచ్‌ అనంతరం అతణ్ని కోహ్లి ఓదారుస్తూ, సూచనలివ్వడం కనిపించింది. కొంత కాలంగా టీ20ల్లో రోహిత్‌కు తోడుగా భారత్‌ ఓపెనర్లను మార్చి మార్చి ఆడిస్తోంది. ధావన్‌ జట్టులో చోటు కోల్పోయాక కొన్ని మ్యాచ్‌ల్లో రాహుల్‌, తర్వాత కోహ్లి అతడితో కలిసి ఓపెనింగ్‌ చేశారు. అయితే కిషన్‌ మాటల్ని బట్టి చూస్తే టీ20 ప్రపంచకప్‌లో అతనే రోహిత్‌ భాగస్వామి కావచ్చనిపిస్తోంది. ‘‘ఓపెనింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. టీ20 ప్రపంచకప్‌లో నన్ను ఆ స్థానంలోనే దించబోతున్నట్లు విరాట్‌ భాయ్‌ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే అన్నిటికి సిద్ధంగా ఉండాలి. విరాట్‌తో పాటు హార్దిక్‌, పొలార్డ్‌తో మాట్లాడడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ కిషన్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని